కేరళలోని కన్నూర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ముందు సీట్లో కూర్చున్న గర్భిణితో పాటు ఆమె భర్తకు మంటలు అంటుకున్నాయి. కారు ముందు డోర్లు జామ్ కావటంతో వారు మంటల్లోనే సజీవదహనమయ్యారు. కారు వెనుక సీట్లలో ఉన్న ఒక చిన్నారితో సహా నలుగురు వెంటనే డోర్లు తెరుచుకుని మంటల నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.