వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్, లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద పెర్ఫ్యూమ్ బాలిట్ లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.