దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 279 పాయింట్లు లాభపడి 60,223 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 17,656 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.15 వద్ద ట్రేడవుతోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.