ఉన్మాది వేధింపులు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన డెంటిస్ట్ ప్రియాంశి త్రిపాఠి (28) ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేసేది. అదే ఆస్పత్రిలో పనిచేసే సుమిత్ అనే వైద్యుడు ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తూ, సిగరెట్, మద్యం తాగాలని ఒత్తిడి చేసేవాడు. తల్లిదండ్రులతో చెప్పి మందలించినా అతని తీరు మారకపోవటంతో జనవరి 24న ప్రియాంశి ఉరి వేసుకుంది.