బెంగళూరులోని కృష్ణరాజపురం హొయ్సళ స్ట్రీట్‌లో మోరిస్, లిడియా దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి నివసించేవారు. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలయ్యేవి. గురువారం పిల్లలు స్కూల్‌కి వెళ్లాక మరోసారి గొడవ పడగా సహనం కోల్పోయిన భర్త డంబెల్‌తో భార్య తలను నుజ్జు చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.