అదానీ కంపేనీలపై హిండెన్ బర్గ్ నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నెల 6వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో LIC, SBI ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచనలు ఇవ్వాలంటూ పీసీసీలను కోరినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. తన సన్నిహితుల కోసం ప్రధాని మోదీ ప్రజల డబ్బుని రిస్కులో పెట్టారని ఆరోపించారు.