పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో భారీగా నష్టపోయిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనుంది. హలో హాంకాంగ్ పేరుతో ఉచిత విమాన టికెట్లు, ఉచిత ఓచర్లు, ప్రత్యేక ఆఫర్లు సైతం అందిస్తోంది. ఈ ఆఫర్స్ మార్చి వరకు అందుబాటులో ఉంటాయని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.