చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ కొన్ని రోజులుగా అమెరికా గగనతలంలో కలకలం రేపుతోంది. నిఘా నిమిత్తం చైనా ఆ బెలూన్‌ను వదిలిందని, దాన్ని కూల్చితే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. ఆ బెలూన్ మోంటానా రాష్ట్ర గగనతలంలో ఉంది. కాగా కొన్నాళ్లుగా అమెరికా, చైనా మధ్య మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ కార్యకలాపాలు వంటి అంశాలపై వివాదం కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa