హిండన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రారంభమైన అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో పలు షేర్లు వరుసగా ఆరో రోజు సైతం నష్టాల్ని చవిచూశాయి. 10 లిస్టెడ్ అదానీ కంపెనీలు ఈ ఆరు రోజుల్లో రూ.8.76 లక్షల కోట్లు నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు లోయర్ సర్క్యూట్ వద్ద కొనసాగుతున్నాయి.