పోలీసుగా విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు ఆచూకీ మిస్ అయ్యింది. వెంకటేశ్వరరావు చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు గాను ఏఆర్ కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో తన్నీరు వెంకటేశ్వరావు పై కేసు నమోదు చేశారని సమాచారం. అయితే ఇప్పటి వరకు కుటుంబసభ్యులు ఎలాంటి సమాచారం లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు. వెంకటేశ్వరావు వ్యాఖ్యలు ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.