తన గొంతును ఆపాలంటే తనను ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం ఉంది కదా అని తనపై మాటల దాడి చేస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.