పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతమని, వైసీపీపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ కాదా అని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నావుగా ఏమైందని కోటంరెడ్డిని మంత్రి ప్రశ్నించారు.