లమంగళగిరి నగరంలోని ఎంటీఎంసీ కార్యాలయంలో అర్హులైన 22మంది టిడ్కో గృహ లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఉన్న సాంకేతిక కారణాల వల్ల ఇళ్ల పట్టాల మంజూరులో జాప్యం జరిగిందని, అధికారులు వాటిని పరిష్కరించడంతో లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ యు. శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.