సుప్రీంకోర్టులో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంతో కలిసి సింగపూర్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సుందరేశ్ మీనన్ కూర్చున్నారు. సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు భారత్ కు జస్టిస్ మీనన్ వచ్చారు. రేపటి కార్యక్రమంలో ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై ప్రసంగిస్తారు.