ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉగ్రమూకల వల్ల దేశానికి జరుగుతున్న నష్టంతో ఉగ్రవాదంపై కూడా పాక్ తీరు కాస్త మారుతున్నట్లు కనపడుతోంది. పాక్ ప్రధాన మంత్రి షెహబాబ్ షరీఫ్ ఫిబ్రవరి 7న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మాజీ ప్రధాని, పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ను కూడా ఆయన ఆహ్వానించడం గమనార్హం.