మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యేళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యమైంది. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు. ఔంధ నాగనాథ్ పట్టణంలోని ఓ జైన ఆలయం పరిసరాల్లో నిర్మాణం జరుగుతుండగా శుక్రవారం దీన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. బసాల్ట్ రాయిపై చెక్కిన ఈ శిల్పం, దానిపై మేక గుర్తు ప్రకారం కుంతునాథ్ భగవాన్ దిగా గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు.