వారాంతంలో దేశ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 909 పాయింట్ల లాభంతో 60,841కు చేరగా నిఫ్టీ 243 పాయింట్లు పెరిగి 17,854 వద్ద స్థిరపడింది. టైటాన్, హెచ్ డీఎఫ్ సీ, బజాజ్, ఫన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ లాభాలు నమోదు చేశాయి. కాగా, నష్టాల్లో ఉన్న అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు మార్కెట్లు ముగిసే సమయానికి కోలుకున్నాయి. గత సెషన్ తో పోలిస్తే రూపాయి విలువ 34 పైసలు పెరిగి డాలర్ కు రూ.81.83గా నిలిచింది.