యూపీలోని ఆగ్రాలో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి ఆగ్రాలోని మాంసం ప్యాకేజింగ్ యూనిట్లో పని చేసేది. అక్కడ 22 ఏళ్ల వ్యక్తిని బాలిక ప్రేమించింది. జనవరి 26న ఇంటి నుంచి పారిపోయి, ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమెపై ప్రియుడు అత్యాచారం చేశాడు. ఆపై బాలికను వేలంలో విక్రయించాడు. నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తప్పించుకుని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.