ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపు విధానం ప్రారంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఈరోజు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలి దశలో 11 మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని రజత్ భార్గవ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో అన్ని మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పారు.