తాము గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని తమ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని ఇద్దరు అబ్బాయిలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వారు సుప్రీంను కోరారు. వారితో పాటు మరో ముగ్గురు తమ పెళ్లిలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేయగా వీటన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.