పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలులో ఉన్న ఓ మాజీ విద్యార్థి నాయకుడు గవర్నరు నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 2019లో గువాహటిలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో సంజీబ్ తాలుక్దార్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. గువాహటి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సు చేశాడు. ఇటీవల రాసిన పరీక్షల్లో 71% మార్కులతో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నాడు.