ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై విధించిన చలాన్లను వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీలోపు చలాన్లను పూర్తిగా చెల్లించే వారికి మొత్తం జరిమానాలో 50% మేర రాయితీ ఇస్తున్నట్లు కర్ణాటక రవాణాశాఖ వెల్లడించింది. కాగా, బెంగళూరులోనే రూ.500 కోట్ల మేర జరిమానా వసూలు కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 80% జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa