విదేశీ పర్యాటకురాలిపై ఐదుగురు వ్యక్తులు వేధింపులకు పాల్పడిన ఘటన కేరళ తిరువనంతపురం జిల్లాలో జరిగింది. విజింజం సమీపంలోని ఆదిమలతురలో బాధితురాలు జనవరి 31న రాత్రి 10 గంటలకు రిసార్ట్ నుండి చౌరా బీచ్‌కి వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన ఆంటోనీ బాధితురాలి తల్లిదండ్రులు ఉపయోగించిన ట్యాక్సీ డ్రైవర్ గా పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.