అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ ఎంపీల ఆస్తుల వివరాలను ప్రకటించింది. 2009 నుండి 2019 మధ్య ఎన్నికైన 71 మంది ఎంపీల ఆస్తులు సగటున 286% పెరిగినట్లు తెలిపింది. ఆస్తుల వృద్ధిలో టాప్ 3 లో బీజేపీ ఎంపీలే ఉన్నారు. బీజాపూర్ ఎంపీ రమేశ్ చందప్పకు 2009లో రూ.1.18 కోట్ల ఆస్తులు 2019లో రూ.50.41 కోట్లకు చేరాయి. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఆస్తులు 2009లో రూ.5.37 కోట్లు ఉండగా 2019లో రూ.75.55కు చేరాయి.