పులివెందుల పట్టణంలోని అతి పురాతనమైన ఆలయం శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు (తిరునాల) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, ఈఓ కేవీ రమణ తెలిపారు. స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథస్వామి కాంప్లెక్స్ రంగనాథస్వామి ఉత్సవ మూర్తులతో 9 రోజులపాటు శ్రీరంగనాథస్వామి సతీసమేతంగా రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.