గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రం మెంబర్ శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి తో పాటు పలువు రైతులు శుక్రవారం వినతిపత్రం అందించారు. సింహాద్రిపురం మార్కెట్ యార్డులో శనిగల కొనుగోలు కేంద్రాన్ని కమిషనర్ తో మాట్లాడి వారం రోజులు ఏర్పాటు చేయిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , నెట్ క్యాప్ డైరెక్టర్ కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల నాయకులు బ్రహ్మానందరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.