నారా లోకేశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా ఆరుగురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని పలమనేరు సీఐ అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదుతో బంగారుపాళ్యం ఎస్సై 353,290,188,341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న ప్రచార వాహనం సీజ్ చేయడంతో లోకేశ్ డాబా ఎక్కి మాట్లాడారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు తోపులాట జరిగింది.