మధ్యప్రదేశ్లో అమానుష ఘటన వెలుగుచూసింది. షాదోల్లోని సింగ్పుర్ కథౌటియాకి చెందిన మూన్నెళ్ల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ఆమె తల్లిదండ్రులు స్థానిక మంత్రిగత్తెకు చూపించటంతో వారు వ్యాధి తగ్గాలని చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. పాప పరిస్థితి మరింత దిగజారటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఇన్ఫెక్షన్ వ్యాపించి చిన్నారి చనిపోయింది.