కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ రైలుపై ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు రాళ్లు రువ్వడంతో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో విశాఖ స్టేషన్లో అధికారులు గ్లాస్ ను మార్చి రైలును 3 గంటలు ఆలస్యంగా పంపారు.