ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక ప్రకటన చేసింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి కంపెనీ ఆవు పేడను ఉపయోగించనున్నట్లు తెలిపింది. దీనిని CNG కార్లను నడపడానికి ఉపయోగించబడుతుందని పేర్కొంది. మారుతి సుజుకికి చెందిన 14 సీఎన్‌జీ మోడల్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆల్టో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, బాలెనో, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఇతర కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి భారతీయ సీఎన్‌జీ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా కలిగి ఉంది. మారుతి 2010లో మూడు మోడల్స్ ఆల్టో, ఎకో, వ్యాగన్ ఆర్ మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్‌ను విక్రయించడం ప్రారంభించింది.
ఇప్పటివరకు, 1.14 మిలియన్లకు పైగా కార్ యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇది 1.31 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను సేవ్ చేసింది. ఉద్గారాల సవాలును ఎదుర్కోవటానికి సుజుకి ప్రత్యేకమైన చొరవ చూసుతోంది. అందులో భాగంగా బయోగ్యాస్ వ్యాపారం ప్రారంభించినట్లు సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తెలిపింది. బయోగ్యాస్ ఆవు పేడ నుండి ఉత్పత్తి చేసిచ సరఫరా చేస్తారు. సీఎన్‌జీ మోడల్ కార్లలో బయోగ్యాస్‌ను ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ విషయంలో కంపెనీ సంస్థ ఏజెన్సీ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్, ఆసియాలోనే అతిపెద్ద పాడి తయారీదారు బనాస్ డెయిరీతో సంస్థ ఒక MOU చేసుకుంది.