టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ దగ్గర రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దాన్ని తిరిగి కట్టమన్నందుకు అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని, చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.