ఇటీవల కాలంలో బ్లాక్ రైస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ బియ్యంతో పోలిస్తే నల్ల బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి.ఈ బియ్యం తింటే షుగర్, బీపీ వంటి రోగాలు అదుపులో ఉంటున్నాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువైంది. బ్లాక్ రైస్ వరి నారుపోసినప్పటి నుండి పంటచేతికి వచ్చేందుకు 100-120 రోజుల సమయం పడుతుంది. సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలోకు 50-100 వరకు ఉండగా, నల్ల బియ్యం రేటు రూ.250-500 వరకు ఉంది.