రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గుధాపై కిడ్నాప్ కేసు నమోదైంది. జనవరి నెలలో మంత్రి రాజేంద్ర తనకు ఫోన్ చేశాడని, తాను నీమ్ క థానాలో ఉన్నానని చెప్పానని దుర్గాసింగ్ అనే వ్యక్తి తెలిపాడు. అనంతరం మంత్రి తనను కారులో బలవంతంగా లాక్కెళ్లాడని, రాజకీయాలు అంటే ఏంటో నేర్పిస్తామని బెదిరించారని దుర్గాసింగ్ వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.