జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ సందర్భంగా చిలుమత్తూరు మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో శనివారంసమావేశం నిర్వహించారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి వెంకటేష్, అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శోభ రాణి మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పేస్ యాప్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని. ఈనెల ఫిబ్రవరి 6న జరిగే అంగన్వాడి ధర్నా నుజయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కోశాధికారి రమచంద్ర, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు వనజమ్మ, పద్మా, సుగుణ, వెంకట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.