శనివారం తలుపుల మండలం, స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనుక భాగం, అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణంలో తలుపుల మండల పరిధిలో గల గృహ సారథులకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి మరియు కదిరి నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర జానపద మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ శ్రీ కొండవీటి నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నియమితులైన గృహ సారథులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని మరొకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారన్నారు. 33 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరిగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జెసిఎస్ మండల ఇంచార్జ్, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.