మారుతున్న సమాజంలో సహజత్వానికి భిన్నంగా పెళ్లిళ్లు సాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ జంట బిడ్డకు జన్మనివ్వనుంది. కేరళకు చెందిన షాహాద్, జియా పావెల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట వచ్చే నెలలోనే బిడ్డకు జన్మనిస్తోంది. ‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే నెరనునున్నాయి.’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను షాహాద్ వాయిదా వేసుకున్నారు. కోజికోడ్‌కు చెందిన షాహాద్, జియా పావల్‌లు రెండేళ్ల కిందటే తమ లింగమార్పిడి చికిత్సను ప్రారంభించారు. కానీ, తొలుత తల్లిదండ్రులవ్వాలనే ఆలోచనతో నిలుపుదల చేశారు.
ప్రస్తుతం షాహాద్ 8 నెల గర్భవతి కాగా.. వచ్చే నెల బిడ్డను ప్రసవించనుంది. ప్రసవమైన కొద్ది నెలల తర్వాత అబ్బాయిగా మారే చికిత్సను తీసుకోనుంది. ‘‘మూడేళ్ల కిందట మేం కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు మా జీవితాలు ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా ఉండాలని అనుకున్నాం.. చాలా మంది లింగమార్పిడి జంటలను సమాజంతో పాటు వారి కుటుంబాలు కూడా బహిష్కరించాయి.. మేము ఒక బిడ్డను కోరుకున్నాం.. తద్వారా మా నుంచి ఏదో ఒకదానిని ప్రపంచానికి ఇస్తున్నాం’’ క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అయిన పావెల్ అన్నారు.
‘‘మా ప్రయాణం ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్‌గా కొనసాగనుంది.. నేను మహిళగా మారడానికి హార్మోన్ల చికిత్సను కొనసాగిస్తున్నాయి.. బిడ్డను ప్రసవించిన ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత షాహాద్ పురుషుడిగా మారే చికిత్సను తీసుకుంటుంది’’ అని పావెల్ రాసుకొచ్చారు. జియా పావెల్‌ది కోజికోడ్ కాగా.. అకౌంటెంట్‌గా పనిచేస్తోన్న షాహద్‌ది తిరువనంతపురం. మూడేళ్లుగా ఇరువురూ సహజీవనంలో ఉన్నారు. తమ లింగమార్పిడి గుర్తింపును తెలుసుకున్న తర్వాత కుటుంబాలను విడిచిపెట్టారు.
షాహద్‌కు లింగమార్పిడి చికిత్స మొదలుపెట్టిన తర్వాత బిడ్డను కనాలని ఈ జంట భావించింది. చికిత్సలో భాగంగా రొమ్ములను తొలగించడంతో ప్రసవం తర్వాత బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు ద్వారా బిడ్డకు పాలను అందజేయనున్నట్టు కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు భరోసా ఇచ్చారు.