మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన పెద్ద కోనేరు (కళ్యాణ పుష్కరిణి )అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవిలతో కలిసి పరిశీలించి దేవస్థాన అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో రామకోటిరెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.