వేసవిలో తాగునీటి ఒత్తిడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె రూరల్ మండలంలోని కైతేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలలో తాగు నీటి కొరత లేకుండా నిరంతరం అధికారులతో పర్యవేక్షించటం జరుగుతుందన్నారు. కైతేపల్లిలో గ్రామస్తుల తాగునీటి పరిష్కారానికై వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో నిర్మూలించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మండలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.