అచ్చంపేట మండలంలోని రెండు బియ్యం దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. తూనీకలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ అల్లూరయ్య తెలిపిన వివరాల ప్రకారం బియ్యం సంచులు నిర్ణీత పరిమాణం కన్నా తక్కువగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని తూనీకలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్. అల్లూరయ్య తెలిపారు.