మంగళగిరి నగరంలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో శనివారం లాయర్ల అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి ప్రాంత ప్రజల, న్యాయవాదుల చిరకాల కోరికగా మిగిలిన అదనపు కోర్టు మంజూరుకు ఎమ్మెల్యే ఆర్కే విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎమ్మెల్యే ఆర్కే తో పాటు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి లకు జీవో కాపీ, పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.