ఉరవకొండ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం గ్రామ సమీపంలోగల పెన్నానదీ పరివాహక ప్రాంతం వంతెన కిందివైపున వెలసిన శ్రీ ఏటి గంగమ్మతల్లి తిరునాళ్ళు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నేడు జరుగనుంది. ప్రతి ఏడాది మాఘమాసం 3వ ఆదివారం అమ్మవారి నిర్వహించడం అనవాయితీగా వస్తుండగా లక్ష్మినరసింహస్వామి ఆలయం, శఏటి గంగమ్మతల్లి ఆలయ కార్యనిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఉరవకొండ చుట్టుప్రక్కల మండలాల నుండే కాకుండా కర్నాటక ప్రాంతం నుండి కూడా వేలాది ఈ ఉత్సవంలో పాల్గొని పెన్నానదీ పరివాహక ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఇక్కడే గొర్రెలు, మేకలు, కోళ్ళు బలి ఇచ్చి వంటలు వండుకొని ఆరగించడం పరిపాటి. పెద్దఎత్తున భక్తులు తరలివస్తుండటంతో గట్టి బందోబస్తు ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. భక్తులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ వచ్చి ఉత్సవంలో పాల్గొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పెన్నహోబిళం ఆలయ కార్యనిర్వహణ అధికారి కె. విజయ్కుమార్ కోరారు.