అరాచకాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలతో పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి శెట్టూరు మండలం, పెరుగుపాల్యం గ్రామ పంచాయతీలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమనికి కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉమా మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక మాంద్యంతో కుదేలవు తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఆర్థిక కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చేసి ప్రతి ఒక్కరి నెత్తిమీద అప్పుల మూటను నెత్తిన పెట్టిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు చీదరించుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. టిడిపి విజయానికి విజయకేతనం ఎగరవేస్తూ ప్రజలందరూ ఏకమై వైసీపీని తరిమికొడుతు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.