ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్లు ఒక మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి. లేదంటే నడుము నొప్పి ఎక్కువవుతుంది. నడుము నొప్పిని నివారించేందుకు తక్కువ ఎత్తు ఉన్న చెప్పులను వాడాలి. లేదంటే నడుముపై ఒత్తిడి పెరిగి నొప్పి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఒక అంగుళం ఎత్తు మడమ ఉన్న చెప్పులు వాడితే మంచిది. ఎముకలు బలంగా లేకపోవడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. డాక్టర్ సలహా మేరకు కాల్షియం, విటమిన్ డీ టాబ్లెట్స్ వాడాలి. పాలు, పాలకూర, వెల్లుల్లి, అల్లం, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. ప్రతి రోజూ పావు గ్లాసు పాలలో 10 చుక్కల వెల్లుల్లి రసాన్ని కలిపి తీసుకోవాలి. అల్లం రసం, పసుపును పాలలో కలిపి తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దనా చేసినా ఫలితం కనిపిస్తుంది. నడుము నొప్పితో బాధపడేవారు వంకాయ, వేరుశనగ నూనె, పెరుగు, మినప పదార్థాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.