ఫిబ్రవరి 6 వ తేదీ సోమవారం సాయంత్రం 5 గం. లకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొండపల్లి కిరణ్ బాబు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజాసమస్యలనడిగి తెలుసుకుంటారన్నారు. మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.