కొంత వయసు వచ్చిన తర్వాత కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. కొన్ని పదార్థాలను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. 30ఏళ్లు పైబడినవారు బీర్లను ఎక్కువగా తాగితే కొవ్వు పెరిగి అనేక వ్యాధులు వస్తాయి. ఇలాంటి వారు స్వీట్లతో పాటు తీపి పదార్థాలను తినడం వల్ల ఉబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉప్పు ఎక్కువగా తింటే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు బీపీ పెరిగి ఇబ్బందుల్లో పడతారు.