భారతీయులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తీపి కబురు అందించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు వారు పర్యటనలో ఉన్న దేశంలోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయాల్లోనే వీసా అపాయింట్మెంట్ను పొందొచ్చని, దాని కోసం భారత్లోని కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తెలిపింది. వీసా జారీలో తలెత్తుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించడానికి తీసుకుంటున్న వరుస చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.