కష్టజీవుల కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యాగం చేసిన అమర వీరులను గుర్తుచేసుకోవటం ప్రతి ఒక్కరి నైతిక బాధ్య తని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) సీపీఎం ఆధ్వర్యంలో నెహ్రూబొమ్మ సెంటర్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేపల్లె తాలూకా అమరవీరుల స్మారకసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమాలలో పోరాటాల పురిటిగడ్డ పాత రేపల్లె తాలూకా ఉద్యమం కీలకమైన పాత్ర పోషించిందన్నారు.