పేదలకిచ్చే బియ్యం తూకం లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బాపట్ల ఎఫ్ సి ఐ గూడెంలో ఈ అక్రమం సోమవారం వెలుగు చూసింది. అవినీతి మార్గంలో కొత్త పుంతలు అవలంభిస్తున్న సిబ్బంది. ప్రతి బస్తాలో 50 కేజీలు ఉండవలసిన బియ్యం 43 కేజీల 690 గ్రాములు ఉండటం డీలర్లకు అయోమయానికి గురి చేస్తుంది. ఎఫ్ సి ఐ గూడెంలో ఉన్న బియ్యాన్ని వేరే గోతంలోకి మార్చి అమ్ముకుంటున్న అవినీతిపరులు. ఇంతలా అవినీతి జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వ అధికార యంత్రాంగం. చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.