పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలంలో వృద్ధ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడులో నివాసముంటున్న వెంకటేశ్వర్లు(70), సామ్రాజ్యం (65) ఆర్థిక ఇబ్బందులతోని పురుగుమందులు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు మరణించడంతో కొంతకాలంగా దంపతులు ఇద్దరు మనోవేదనలో ఉన్నారని చెప్పారు.