హిందూపురం పట్టణంలో ప్రసిద్ది గాంచిన శ్రీ పేట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాదిమంది భక్తులు బ్రహ్మ రథోత్సవం తిలకించేందుకు తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే మూల విరాట్‌ను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సంరద్భంగా గోవింద నామ స్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. అనంతరం శాస్త్రోతంగా మేళా తాలాలతో మంగళ వాయిద్యాలతో ఉత్సవ పల్లకిలో తీసొచ్చి రథంలో అధిరోహింపచేసి కన్యకా పరమేశ్వరీ ఆలయం సర్కిల్ నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు రథంను లాగారు. భక్తులు అరటిపండు, దవణంను స్వామి వారికి సమర్పించి భక్తి చాటుకున్నారు. గోవిందా. గోవిందా అంటు నినాదాలు చేశారు. పోలీసులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.